News December 16, 2025

మెస్సీ ఈవెంట్‌తో రాహుల్ మెసేజ్!

image

వరుస విజయాలు రేవంత్ రెడ్డికి జోష్, పుష్ ఇస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడంతో సమీకరణాలు మారిపోయాయి. కొన్ని నెలల క్రితం పొసగని, హైకమాండ్ వద్ద పొగబెట్టిన నేతలు సైతం ఇప్పుడు కామ్ అయ్యారు. ఇక HYDలో మెస్సీ ఈవెంట్‌కు రాహుల్ హాజరై CM వైపే ఉన్నానని మెసేజ్ ఇచ్చారు. ఈ జోష్, పుష్‌తో పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్ మరింత స్వతంత్రంగా పనిచేసే అవకాశముంది.

Similar News

News December 22, 2025

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రిన్సీ కుమారి (20) ఆత్మహత్య చేసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆమె బీటెక్ సెకండ్ ఇయర్(CSE) చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో పరీక్షల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం. ‘సారీ మమ్మీపప్పా.. మీ అంచనాలు అందుకోలేకపోతున్నా. బాధగా ఉంది. చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది.

News December 22, 2025

మినుము, పెసర విత్తాక కలుపు నివారణ ఎలా?

image

మినుము, పెసరలో కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 1,2 రోజులకు నేల తేమగా ఉన్నప్పుడు ఎకరానికి 200లీ. నీటిలో పెండిమిథాలిన్ 30% 1 లీటరు లేదా అలాక్లోర్ 50% 1.5లీటరు కలిపి పిచికారీ చేసి తొలిదశలో కలుపు నివారించవచ్చు. వరి మాగాణుల్లో విత్తిన మినుము, పెసరలో తొలిదశలో కలుపు నివారణకు వరి పనలు తీసిన వెంటనే ఎకరానికి 20KGల ఇసుకలో పెండిమిథాలిన్ 30% 1.25L కలిపి చల్లాలి తర్వాత 200 లీటర్లు నీరు పిచికారీ చెయ్యాలి.

News December 22, 2025

ఈ ఫుడ్స్‌లో పుష్కలంగా ప్రొటీన్లు!

image

శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రొటీన్ ఒకటి. కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 100గ్రాముల సోయాబీన్స్‌లో 36.5 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అలాగే జనపనార గింజలు(31.6g), సన్‌ఫ్లవర్ సీడ్స్(20.8g), అవిసెలు(18.3g), పెసరపప్పు(24.0g), రాజ్మా(23.6g), కందులు(22.3g), వేరుశనగలు(25.8g), బాదం(21.2g), పన్నీర్(18.0g), పెరుగు(3.5g), పాల నుంచి 3.3 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.