News December 11, 2025
మెస్సీ ప్రోగ్రామ్‌తో GOVTకి సంబంధం లేదు: CM

TG: ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ ఈనెల 13న HYDలో పాల్గొనే ‘Meet and Greet with Messi’ ప్రోగ్రాంకు ప్రభుత్వానికి సంబంధం లేదని CM రేవంత్ చెప్పారు. ‘ఓ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. CMగా ఉన్న నన్ను అతిథిగా ఆహ్వానించడంతో హాజరవుతాను. ప్రముఖ క్రీడాకారుడి కార్యక్రమం కనుక ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నాము’ అని CM వివరించారు. దీనికి రావాలని రాహుల్, ప్రియాంక సహా పలువురిని పిలిచానన్నారు.
Similar News
News December 13, 2025
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News December 13, 2025
గుమ్మడి దీపం పెడుతూ పఠించాల్సిన శ్లోకం..

కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం
‘నేను బూడిద గుమ్మడికాయను బలిగా సమర్పిస్తున్నాను. ఫలితంగా నా జీవితంలో అదృష్టం, శుభం స్థిరంగా ఉంటాయి. ఈ బలి రూపాన్ని ధరించిన దైవ శక్తికి, అలాగే ఎన్నో రూపాల్లో ఉన్న ఆ శక్తికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను’ అని చెప్పి కూష్మాండ దీపం వెలిగించాలి. తద్వారా ఆర్థిక, గ్రహ, కుటుంబ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.
News December 13, 2025
పొగమంచు, డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు

AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు <<18540788>>ప్రమాదానికి<<>> డ్రైవర్ మధు అతివేగమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా మలుపుల వద్ద వేగంగా తిప్పడంతో నియంత్రించలేకపోయాడని తెలిపారు. నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది చనిపోయారన్నారు. అయితే ప్రమాదానికి ముందు బ్రేక్ పడట్లేదని మధు చెప్పాడని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని మరో డ్రైవర్ ప్రసాద్ చెప్పారు.


