News January 26, 2026

మేం ఆడాలనుకున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇదే: సూర్య

image

T20 WCకు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ముందుగా బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా మేము ఆడాలనుకున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇదే. వికెట్లు కోల్పోయినప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు. కాస్త డిఫరెంట్‌గా ముందుకు వెళ్లాలనుకుంటే ఇదే ఉత్తమమైన మార్గం. టాప్-3 బ్యాటర్లు నా పనిని మరింత సులభం చేశారు’ అని NZతో మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. నిన్న 10 ఓవర్లలో <<18957732>>మ్యాచ్‌ను<<>> ఫినిష్ చేశారు.

Similar News

News February 20, 2026

2028 SEP కల్లా ఐకానిక్ టవర్స్ రెడీ: నారాయణ

image

AP: అమరావతిలో సెక్రటేరియేట్ కోసం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్‌ను 2028 SEP కల్లా రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ‘గతంలో 26,700 మంది ఉద్యోగులకు వీలుగా 52.72 L చ‌.అ. బిల్ట్ అప్ ఏరియా, 31.71 L చ‌.అ. కార్పెట్ ఏరియాతో వీటిని డిజైన్ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు 39,882 మంది ఉన్నారంటున్నారు. నయా రాయ్‌పుర్, HYD సచివాలయ, సెంట్రల్ విస్టాను పరిశీలించాలని అధికారులకు సూచించాం’ అని సచివాలయంలో చెప్పారు.

News February 20, 2026

TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

image

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.

News February 20, 2026

టెన్త్ స్టూడెంట్ల పేర్లలో తప్పుల సవరణకు ఛాన్స్

image

AP: టెన్త్ విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, జెండర్ వివరాల్లో తప్పులుంటే స్కూళ్ల ఐడీల ద్వారా HMలు ఈనెల 21లోపు సరిచేయాలని బోర్డు సూచించింది. బోర్డు అందించే లింకుల్లో వీటిని సమర్పించాలంది. కరెక్షన్స్‌ను విద్యార్థులు, పేరెంట్స్ కూడా సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరుకానున్నారు.