News December 27, 2025

‘మేకపోతుల బలి’ రాజకీయం!

image

AP: ఈ నెల 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల YCP కార్యకర్తలు, అభిమానులు మేకపోతులను బలి ఇచ్చారు. వాటి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలపై చల్లుతూ, రప్పారప్పా నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇవాళ తూ.గో. జిల్లాలో ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సినిమా రిలీజ్‌ల సందర్భంగా హీరోల ఫ్లెక్సీలపై రక్తం చల్లితే తప్పు లేదా అని వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Similar News

News December 28, 2025

రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!

image

TG: BRS చీఫ్ KCR రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం దాదాపు ఖరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన సభలో జరిగే చర్చలో పాల్గొననున్నారు. అందులోనూ కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై CM రేవంత్, KCR మధ్య మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. గులాబీ బాస్ సంధించే ప్రశ్నలకు CM తనదైన శైలిలో ఎలా స్పందిస్తారో చూసేందుకు మీరూ సిద్ధమా? రేపు ఉ.10.30 గంటల నుంచి అసెంబ్లీ లైవ్‌ను Way2Newsలో చూడండి.

News December 28, 2025

త్వరలో ఒక్క సిగరెట్ ధర రూ.72

image

ఎక్సైజ్ డ్యూటీ పెంచి సిగరెట్లను కొనలేనంత భారం చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రూ.18కు కొంటున్న ఒక్క సిగరెట్ ధర త్వరలో రూ.72కు పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో రేట్లు పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్‌-2025లో కేంద్రం ప్రపోజల్స్ పెట్టింది. దీనిపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News December 28, 2025

జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు!

image

జమ్మూ ప్రాంతంలో 30 మందికిపైగా పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. కొండలు, అడవులు, లోయల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలను గమనించేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. తీవ్ర చలిని తట్టుకుని.. ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచేందుకు పర్వత ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేశారు.