News March 9, 2025

మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం: ఎంపీ 

image

ఏలూరు నగరాన్ని మేజర్ సిటీగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఏలూరు సిటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

image

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.

News December 16, 2025

ఖమ్మం: 18 నుంచి 22 వరకు రేషన్ బియ్యం

image

ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.

News December 16, 2025

TDP ప.గో జిల్లా అధ్యక్షుడిగా రామరాజు..?

image

TDP పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APIIC ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలోనూ TDP జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండో సారి కూడా రామరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.