News January 11, 2026

మేడారంలో నో సిగ్నల్స్.. భక్తుల అసహనం

image

మేడారం మహా జాతరలో సిగ్నల్స్ లేక అవస్థలు తప్పడం లేదు. జాతర మొదలుకాక ముందే సిగ్నల్ అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మొబైల్ సిగ్నల్‌పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫోన్లు కలవకపోవడం లేదని, ఇంటర్నెట్ పనిచేయడం లేదని వాపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతర ఉండగా ఇప్పుడే సిగ్నల్ కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Similar News

News February 6, 2026

NZB: రూ.21 కోట్ల రోడ్ల పనులకు CM శంకుస్థాపన

image

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జిల్లాలో పలు రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుంచి బినోలా రోడ్డు వరకు, పీడబ్ల్యూడీ & జేఎన్‌ఎన్ రోడ్డు నుంచి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు రోడ్డు వెడల్పు, బలోపేత పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ పనులను రూ.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.

News February 6, 2026

HYD: భవనంపై నుంచి దూకి వివాహిత సూసైడ్

image

కూకట్‌పల్లిలోని సీబీసీఐడీ కాలనీలో అనిత(23) వివాహిత ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనితకు 2021లో బాచుపల్లి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.