News January 13, 2026
మేడారంలో మాస్టర్ కంట్రోల్ రూమ్!

మేడారం భక్తుల సేవ కోసం జిల్లా యంత్రాంగం మేడారంలో మాస్టర్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈనెల 15 నుంచి అందుబాటులోకి రానుంది. జాతరకు వచ్చిన భక్తులకు ఏవిధమైన సమస్య ఎదురైనా సహాయం, ఫిర్యాదు కోసం నాలుగు మొబైల్ నంబర్లు, ఓ ల్యాండ్ లైన్ ఫోన్‌ను ఏర్పాటు చేశారు. 24/7ఈ నంబర్లు పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్‌తో సమస్య పరిష్కారం, సహాయం అందించేందుకు అధికారులు సహకరిస్తారు.
Similar News
News February 12, 2026
‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.
News February 12, 2026
సంక్షోభంలో సింగరేణి.. కొత్త CMD గట్టెక్కించేనా?

సింగరేణి నూతన సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా నైనీ బొగ్గు బ్లాకుల టెండర్లు, నిధుల మళ్లింపు ఆరోపణలతో రేగిన రాజకీయ దుమారం, కేంద్ర విచారణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడైన అధికారికి పగ్గాలు అప్పగించేలా భారీ కసరత్తు చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడంలో కొత్త బాస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
News February 12, 2026
KNR: ‘సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

KNR మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని వైద్య బృందానికి సూచించారు.


