News January 13, 2026
మేడారంలో రాత్రి షిఫ్ట్ పనులు పరిశీలించిన కలెక్టర్

సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ దివాకర మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ రాత్రి షిఫ్ట్‌లో జరుగుతున్న క్యూలైన్, ఆలయ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ట్రైనీ ఆర్డీఓ, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ పాల్గొన్నారు.
Similar News
News February 8, 2026
KMR: ఈ నెల 9 నుంచి 14 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రదేశాల్లో చీఫ్ మినిస్టర్ కప్-2026 జిల్లా స్థాయి క్రీడలను ఈ నెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా యూత్&స్పోర్ట్స్ ఆఫీసర్ రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పలు క్రీడలకు ఇన్‌ఛార్జ్‌లను సైతం నియమించారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసే క్రీడల వద్ద ప్రాథమిక చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలని DMHO డా.విద్యను ఆయన కోరారు. సంబంధిత PHC సిబ్బందిని ఆమె నియమించారు.
News February 8, 2026
కలర్ ఫుల్‌గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్‌లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొత్త టేకింగ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.
News February 8, 2026
రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.


