News October 30, 2025
మేడారంలో 5 సెంటీమీటర్ల వాన

తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా పడిన వానకు 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులో 4.9 సెం.మీ, ఖాసీందేవిపేటలో 4 సెం.మీ, వెంకటాపూర్ 3.8 సెం.మీ, తాడ్వాయి 3.5, గోవిందరావుపేటలో 3.1 సెం.మీ వర్షం కురిసింది. వర్షం ఇలాగే కొనసాగి వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను తెరవాలని అధికారులు సమాయత్తమవుతున్నారు.
Similar News
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.
News October 30, 2025
ఎంజీఎంలో రూ.2 కోట్ల స్కాంపై కదిలిన డీఎంఈ!

ఎంజీఎంలో ఎలాంటి టెండర్లు లేకుండా స్టేషనరీ కొనుగోలు చేశారంటూ Way2Newsలో వచ్చిన <<18140653>>ఎంజీఎంలో రూ.2 కోట్ల స్కాం <<>>కథనంపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. సమగ్ర విచారణకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించడంతో HYD నుంచి MGMకు అధికారులు బయలుదేరారు. బదిలీ అయిన సూపరింటెండెంట్‌ను కార్యాలయంలోనే ఉండాలని, ఎలాంటి పత్రాలు తీసుకెళ్లవద్దంటూ ఆదేశించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు సమాచారం.
News October 30, 2025
వనపర్తి: ఈనెల 31న రన్ ఫర్ యూనిటీ 2K రన్: ఎస్పీ

దేశ ఏకత, సమైక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘రన్ ఫర్ యూనిటీ 2K రన్’ లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎకో పార్క్ వరకు 2K రన్ కొనసాగుతుందన్నారు. యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు పాల్గొన్నాలని కోరారు.


