News January 3, 2026

మేడారంలో 50, ములుగులో 20 పడకల ఆసుపత్రులు

image

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించడానికి మేడారంలో 50 బెడ్స్‌తో ఫస్ట్ రిఫరల్ సెంటర్, ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో 20 బెడ్ల ప్రత్యేక వార్డు, రిఫరల్ వైద్య సేవలు ఎంజీఎం హాస్పిటల్‌లో అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశంనిర్ణయించింది. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు.

Similar News

News January 10, 2026

సంగారెడ్డి: ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలి: ఎస్పీ

image

పోలీసులకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని, శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్ధవంతంగా విధులను నిర్వహించాలన్నారు. ప్రతి రోజు యోగా, వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్‌ను కాపాడుకోవాలన్నారు.

News January 10, 2026

చిత్తూరులో రేపు వడ్డే ఓబన్న జయంతి

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానునట్లు పేర్కొన్నారు.

News January 10, 2026

నల్గొండ: ఎన్నికల్లో వెండి విగ్రహాల పంపిణీ.. ట్విస్ట్ ఏంటంటే?

image

కొండమల్లేపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడు తనకే ఓటు వేయాలంటూ ఓటుకు 2 తులాల వెండి విగ్రహాన్ని అందజేసి ప్రమాణం చేయించుకున్నాడు. అనంతరం విగ్రహాలు ఇచ్చిన వ్యక్తినే ఓటర్లు గెలిపించారు. విగ్రహాలు ఇటీవల పరీక్షించగా నకిలీవని బయటపడ్డాయి. తమను మోసం చేసిన ప్రజాప్రతినిధులను, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై విచారణ జరిపి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.