News January 3, 2026
మేడారంలో 50, ములుగులో 20 పడకల ఆసుపత్రులు

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించడానికి మేడారంలో 50 బెడ్స్‌తో ఫస్ట్ రిఫరల్ సెంటర్, ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో 20 బెడ్ల ప్రత్యేక వార్డు, రిఫరల్ వైద్య సేవలు ఎంజీఎం హాస్పిటల్‌లో అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశంనిర్ణయించింది. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు.
Similar News
News March 2, 2026
కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 252 వినతులు

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.
News March 2, 2026
అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్

జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెబ్‌ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూల్యాంకనకు సిబ్బందిని నియమించాలన్నారు.
News March 2, 2026
హోలీ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవాలి: భూపాలపల్లి ఎస్పీ

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. పండుగ సందర్భంగా ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. బైకులపై, కార్లలో గుంపులుగా తిరుగుతూ పెద్ద శబ్దాలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


