News January 23, 2026

మేడారంలో 5,700 టాయిలెట్ల ఏర్పాటు!

image

మేడారానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల సౌకర్యం కోసం 5,700 టాయిలెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. 285 టాయిలెట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి, వీటిని పరిశుభ్రంగా నిర్వహించేందుకు 255 మంది సిబ్బందిని నియమించారు. ప్రధాన ఆలయ పరిసరాలు, జాతీయ రహదారి, పార్కింగ్ ప్రాంతాల్లో, గ్రామాల నుంచి వచ్చే దారులు, చెరువుల సమీపంలో టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 15, 2026

భారత్-పాక్ మ్యాచ్.. వర్షానికి 70% ఛాన్స్!

image

కొలంబోలో ఈ రాత్రి జరగనున్న భారత్-పాక్ T20 WC మ్యాచ్‌పై వరుణుడి నీడ కమ్ముకొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 70% వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు (సాయంత్రం 6-7 గంటల మధ్య) భారీ వర్షం, ఆ తర్వాత జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. లేదా ఓవర్లను భారీగా తగ్గించాల్సి రావచ్చు.

News February 15, 2026

జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే కావాలి: పవన్

image

AP: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రారంభించారు. రూ.2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించగా 2024 ఎన్నికల తర్వాత అది 12.98 లక్షలకు చేరుకుందని పవన్ చెప్పారు. జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి అవసరమని వ్యాఖ్యానించారు.

News February 15, 2026

HNK: అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్

image

అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండగా, ఆమెను అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి జడ్జి ముందు హాజరు పరచగా, ఆమెకు రిమాండ్ విధించి నర్సంపేట జైలుకు తరలించారు.