News September 16, 2025
మేడారం గద్దెల విస్తరణలో వ్యూహాత్మకంగా ముందుకే..!

మేడారం వన దేవతల గద్దెల విస్తరణలో ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే జాతరలో ఇరుకైన ఈ ప్రాంగణం విస్తరణకు గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించగా సాధ్యం కాలేదు. ప్రస్తుత సర్కారు ప్రయత్నం మొదలు పెట్టింది. ఆదివాసీ సంఘాలు విబేధించడం, రాజకీయ ప్రమేయం పెరగడంతో మంత్రి సీతక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పూజారులతో కౌంటర్ ఇప్పిస్తున్నారు. విమర్శలకు చెక్ పెడుతున్నారు.
Similar News
News September 16, 2025
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. రేపే అధికారిక ప్రకటన

TG: బీసీ నినాదంతో MLC తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గం.11AMకు ఈ కార్యక్రమం జరగనుంది. ‘బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి’ అని మల్లన్న ఆకాంక్షించారు.
News September 16, 2025
చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: MP కావ్య

మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. తిరుపతిలో మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ “POSH చట్టం అమలు, 2013” అనే అంశంపై పలు బ్యాంకుల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. పోష్ చట్టంపై మహిళలందరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీ పేర్కొన్నారు.
News September 16, 2025
మాదకద్రవ్యాలు సమాజానికి ప్రమాదకరం: ఎస్పీ

జిల్లాలో గంజాయి సహా నిషేధిత మారకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారం, సాగు విస్తరిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వాటిని అరికట్టేందుకు సమగ్ర వ్యూహరచనతో చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. మాదకద్రవ్యాలలు సమాజానికి ప్రమాదకరమని, ఇవి యువతను, కుటుంబాలను దారి తప్పించి, శాంతి భద్రతలకు ముప్పు తెస్తాయన్నారు.