News September 23, 2025

మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

image

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.

Similar News

News September 23, 2025

ADB: స్థానిక పోరు.. చేరికల జోరు

image

స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే చేరికలపై దృష్టి సారించాయి. అన్ని పార్టీలు మీటింగ్లు పెడుతూ గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు నాయకులను చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్‌ను వీడిన నేతలు మళ్లీ పార్టీలో చేరారు. మండల స్థాయి సమావేశాలు పెడుతూ BJP చేరికలపై ఫోకస్ పెట్టింది. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే మళ్లీ ఆరోజులు రావాలంటూ BRS జోరు పెంచింది. లోకల్ వార్ రసవత్తరంగా మారింది.

News September 23, 2025

అడ్డతీగల: పురిటినొప్పులు అధికమై..108లోనే ప్రసవం

image

పురుటినొప్పులతో బాధపడుతూ ఓ నిండు గర్భిణి 108లో బిడ్డను ప్రసవించిన ఘటన అడ్డతీగల(M) డొక్కపాలెంలో నేడు జరిగింది. డొక్కపాలెనానికి చెందిన రత్నం ప్రసవవేదన పడుతుండగా కుటుంబీకులు 108కు సమాచారమిచ్చారు. అంబులెన్స్‌లో అడ్డతీగలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రోడ్డు పక్కన 108ను ఆపి సిబ్బంది రాఘవ, శివ పార్వతి పురుడుపోసారు. అనంతరం సీహెచ్సీకి తరలించారు.

News September 23, 2025

KNR: ఈనెల 30నే లాస్ట్.. వాహనదారుల్లో టెన్షన్..!

image

వాహనాల చోరీ నివారణ, లీగల్ సపోర్ట్ టార్గెట్‌గా కేంద్రం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ విధానం తెచ్చింది. 2016 పూర్వం కొన్న వాహనాలకు ఈనెల 30లోపు HS నంబర్ ప్లేట్లు ఫిక్స్ చేయాలంది. కాగా, పాత వెహికిల్స్ వివరాలు ఆన్లైన్లో లేక HSNPకి ఎవరూ అప్లై చేయలేదు. దీంతో డేట్ ముగిశాక పెనాల్టీలు వేస్తారేమోననే టెన్షన్ వాహనదారుల్లో మొదలైంది. ఉమ్మడి KNRలో 11.60లక్షల వాహనాలుండగా 2016 ముందు కొన్న వాహనాలు 2.70లక్షలుగా ఉన్నాయి.