News March 10, 2025

మేడారం జాతరకు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

image

ములుగు జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. రానున్న మహా మేడారం జాతరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 15, 2025

IIRSలో 11 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌ (<>IIRS<<>>) 11 JRF పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 నుంచి డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, GATE అర్హత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iirs.gov.in/

News November 15, 2025

ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

image

TG: జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.

News November 15, 2025

కామారెడ్డి: ప్రభుత్వ పీజీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

కామారెడ్డిలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో MA (ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్), MSW, MCom, MSc (బాటని, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫిషరీస్) మొత్తం 12 కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.‌‌