News January 23, 2026
మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.
Similar News
News February 18, 2026
అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

PM కిసాన్ కింద 22వ విడత నిధులకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేయాలని భావిస్తోంది. అయితే తేదీపై ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. PM కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతలుగా రూ.6,000 అందిస్తోంది. లబ్ధి పొందేందుకు ఇప్పటివరకు <
News February 18, 2026
పిల్లలకు డబ్బాపాలు పడుతున్నారా?

డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. * అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. సీసాలో ఇస్తున్నప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వకూడదు. * నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.
News February 18, 2026
మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!

ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ తొలి బ్యాటరీ రెంటల్ వాహనం ‘ఈ-విటారా’ SUVని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ దూసుకెళ్లనుంది. బ్యాటరీ యూజ్ ఎ సర్వీస్ ఓనర్‌షిప్ కింద ప్రారంభ ధర రూ.10.99లక్షలుగా ఉంది. మొదలవుతుంది. బ్యాటరీ యూసేజ్ రెంట్ ఛార్జీ కి.మీకు రూ.3.99 చొప్పున చెల్లించాలి. ఈవీ లాంచ్‌తో నిన్న మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి.


