News October 30, 2025
మేడారం జాతరకు పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థ : సీఎండీ

మేడారం మహా జాతర విజయంతానికి పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మేడారంలో పర్యటించి విద్యుత్ పనులను పరిశీలించారు. ములుగు, ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని ఇంజినీర్లతో సమీక్ష జరిపారు. జాతర జరిగినన్ని రోజులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. అవసరమైన మ్యాన్ పవర్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News October 30, 2025
కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.
News October 30, 2025
ఆ విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ: అడ్లూరి

TG: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీం కింద ఒక్కో విద్యార్థికి ₹20 లక్షల చొప్పున 2,288 మందికి ₹304 కోట్లు <<18143119>>విడుదల<<>> చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 2022 నుంచి ఇప్పటివరకు ₹463 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర విద్యార్థులకు ఉపశమనం లభిస్తుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు.
News October 30, 2025
తంగళ్లపల్లి: టార్పాలిన్ కవర్లు తప్పనిసరి: కలెక్టర్ ఆదేశం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్ కవర్లు అందజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం ఆమె తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.


