News November 17, 2025

మేడారం జాతరకు భద్రాద్రి నుంచి ప్రత్యేక బస్సులు

image

జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహా జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని టీజీఆర్టీసీ యోచిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం కూడా ఈ జాతర సందర్భంగా అమలులో ఉండనుంది. తెలంగాణ ఆర్టీసీ ఈసారి మొత్తం 4,000 బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Similar News

News November 17, 2025

HYD: ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారుల కొరడా

image

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.

News November 17, 2025

జిన్నింగ్ మిల్లుల బంద్‌.. రైతుల ఆవేదన!

image

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

News November 17, 2025

వచ్చే ఏడాది నా పెళ్లి: సాయి దుర్గ తేజ్

image

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.