News January 7, 2026
మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి డైలీ బస్సులు

మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి బస్సులు శుక్రవారం నుంచి ప్రతి రోజు నడుస్తాయని డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. ఎక్స్ ప్రెస్ సర్వీసు ప్రతిరోజు ఉదయం 6 గంటల బయలుదేరి 9 చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4 బయలుదేరి 7 గంటల వరకు మహబూబాబాద్‌కు వస్తుందని ఆమె తెలిపారు. పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.160 టికెట్ ధర ఉంటుందన్నారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
రైతులకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి: కలెక్టర్

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రుణాలు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా సహకార బ్యాంకులు రైతులకు సరైన సమయంలో రుణాలు అందించాలన్నారు.
News January 8, 2026
జనగామలో విద్యాశాఖపై జిల్లా స్థాయి సమావేశం

జనగామ ఐడీఓసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి పింకేష్ కుమార్, హైదరాబాద్ SIET జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యాశాఖ జిల్లా స్థాయి సమావేశంతో పాటు పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెలతో పోలిస్తే జిల్లా పురోగతి సాధించిందన్నారు. కానీ ఇంకా ముందుకు సాగాలని సూచించారు.
News January 8, 2026
ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. సీఎం సమీక్ష

TG: సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని రివ్యూ మీటింగ్‌లో సూచించారు. ‘సోలార్ కిచెన్‌ల ఏర్పాటును పరిశీలించాలి. యంగ్ ఇండియా స్కూళ్ల పనుల్ని వేగవంతం చేయాలి. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని చెప్పారు.


