News November 27, 2025
మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్: ములుగు ఎస్పీ

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో అమలవుతున్న మాస్టర్ ప్లాన్‌తో మరో పదేళ్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభిప్రాయ పడ్డారు. ఈసారి జాతరలో పది వేల మందికిపైగా పోలీసులు పనిచేస్తారని తెలిపారు. ట్రాఫిక్, క్రౌడ్, క్రైమ్ కంట్రోల్ కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తామన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 27, 2025
కడప బౌలర్ శ్రీచరణికి రూ.1.3 కోట్లు

WPL మెగావేలం-2026లో తెలుగు ప్లేయర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ కడప బౌలర్‌ను రూ.1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో శ్రీచరణి రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
News November 27, 2025
ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, బెదిరింపులు, ఇతర అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 27, 2025
PPPని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదు: బొత్స

AP: జగన్‌కు మంచి పేరు రాకూడదనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో జగన్ ముందుకెళ్లారని, ప్రజల ఆరోగ్యం కోసం వైద్యరంగానికి నిధులు కేటాయించారని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని, అన్ని విషయాలు గవర్నర్‌కు వివరించామని చెప్పారు. PPPని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


