News December 31, 2025
మేడారం జాతరకు 12వేల మందితో బందోబస్తు: ఎస్పీ

మేడారం జాతరలో 12వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో 20 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తారని వెల్లడించారు. తొలిసారిగా డ్రోన్ కామాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 20 డ్రోన్లతో ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. 460 సీసీ కెమెరాలతో లైవ్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News January 1, 2026
బాపట్ల: ఈ-ఆటో వాహనాల ప్రారంభం

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు కేటాయించిన ఈ-ఆటోలు వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతగా ఎనిమిది ఆటోలు జిల్లాకు మంజూరైనట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు.
News January 1, 2026
అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
News January 1, 2026
గద్వాల: డ్రైవింగ్ సామాజిక బాధ్యతగా గుర్తించాలి- కలెక్టర్

వాహనదారులు డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రమాదాల నివారించవచ్చని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ముద్రించిన కరపత్రాలను గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో రవాణా శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. చాలామంది అవగాహన లేక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.


