News January 21, 2026

మేడారం జాతరకు 244 ప్రత్యేక బస్సులు:ఆర్ఎం సరీరామ్

image

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం ఖమ్మం రీజియన్ నుంచి 244 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం సరీరామ్ తెలిపారు. ఖమ్మం నుంచి 10, ఇల్లందు 41, సత్తుపల్లి 17, చర్ల 3, వెంకటాపూర్ 6, భద్రాచలం 21, పాల్వంచ 15, కొత్తగూడెం 110, మణుగురూ 16, మంగపేట 5 సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులన్నీ మేడారంలోని గద్దెల సమీపానికే వెళ్తాయని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2026

స్కూలు విద్యార్థులకు SM నిషేధిస్తూ చట్టం: అనిత

image

AP: పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. SMలో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్వేషపూరిత, అసభ్య పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో SM పోస్టులపై 1,384 కేసులు నమోదు చేశామని, 1,067 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

News February 23, 2026

NZB: 30 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.

News February 23, 2026

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి మార్చ్ 3, 5, 6 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. టీజీటీ హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్, కంప్యూటర్ బోధకుడు, సంగీతం/నృత్య బోధకుడు, కౌన్సిలర్, ప్రత్యేక ఉపాధ్యాయుడు, PRT, Sports బోధకుడు, తెలుగు భాషా ఉపాధ్యాయుడు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు.