News December 18, 2025

మేడారం జాతరకూ.. మహాలక్ష్మి పథకం: MD

image

మేడారం జాతరకు ఈ సారి మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు RTC ఎండీ నాగిరెడ్డి తెలిపారు. HYD నుంచి మేడారం వెళ్లే మహిళా ప్రయాణికులకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. జాతరకు వెళ్లే మహిళలకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Similar News

News December 21, 2025

పాకిస్థాన్ భారీ స్కోరు

image

అండర్-19 మెన్స్ ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 347-8 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో ఏకంగా 172 రన్స్ బాదారు. ఇందులో 9 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. అహ్మద్ హుస్సేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) రాణించారు. భారత బౌలర్లలో దేవేంద్రన్ 3, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఒక వికెట్ తీశారు.

News December 21, 2025

TDP నెల్లూరు జిల్లా బాస్‌గా బీద రవిచంద్ర

image

అందరూ ఊహించినట్లే టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర నియమితులయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్లు వెంకటేశ్వర్లు రెడ్డికి అవకాశం ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవికి పలువురు పోటీపడ్డారు. ఓ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పోటీపడగా.. బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం దక్కింది.

News December 21, 2025

కడప జిల్లాలో పంటల సాగు ఇలా.!

image

కడప జిల్లాలో రబీలో పెద్దముడియం మండలంలో అత్యధికంగా 11580 హెక్టార్లలోను, ఒంటిమిట్టలో అత్యల్పంగా 12 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. VNపల్లె-8506, జమ్మలమడుగు-6248, ఎర్రగుంట్ల-5900, కమలాపురం-5555, సింహాద్రిపురం-5571, రాజుపాలెం-5226, కొండాపురం-4011, వల్లూరు-3651, ప్రొద్దుటూరు-2775, వేముల- 2730,
ముద్దనూరు-2081, పెండ్లిమర్రి-1714, వేంపల్లె-1645, కలసపాడు- 1154, తొండూరు-1088 హెక్టార్లలో పంటల సాగు జరిగింది.