News January 2, 2026
మేడారం జాతరపై వైద్యాధికారుల సమీక్ష

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు సమావేశమయ్యారు. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిపారు. ప్రభుత్వ వైద్యశాలలోని స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకోవాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో డిప్యూట్ చేసుకోవాలన్నారు.
Similar News
News January 2, 2026
పెడన: యువకుడి సూసైడ్

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్ (28) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
ఈ ప్రాణులు భాగస్వామితో కలవగానే చనిపోతాయి

ప్రపంచంలో 11 ప్రాణులు తమ భాగస్వామితో కలిశాక చనిపోతాయని BBC వైల్డ్ లైఫ్ పేర్కొంది. అవి.. గ్రీన్ అనకొండ, మగ తేనెటీగలు, అమెజాన్ కప్ప, ఎలుకను పోలిన యాంటిచినుస్ మార్సుపియాల్స్, వాస్ప్ స్పైడర్స్, ఆక్టోపస్, గొల్లభామను పోలిన ప్రేయింగ్ మాంటిస్, పసిఫిక్ సాల్మన్, రెడ్‌బ్యాక్ స్పైడర్స్, లాబర్డ్ ఊసరవెల్లి. కలిసిన సమయంలో అధిక హార్మోన్ల విడుదల, శక్తి కోల్పోవడం, భాగస్వామి తినేయడం వంటి కారణాలతో ఇవి చనిపోతాయి.
News January 2, 2026
పొగ మంచు నేపథ్యంలో వెస్ట్ డీసీపీ సూచనలు

జనగామ జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు నేపథ్యంలో జిల్లా ప్రజలకు వాహనదారులకు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పలు సూచనలు చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉదయం రాత్రి వేళల్లో పొగ మంచు ఏర్పడుతుందని, దీంతో రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నియంత్రిత వేగంతో వాహనం నడపాలని, వాహనానికి సురక్షిత దూరం పాటించి, లో భీమ్ హెడ్లైట్లు ఉపయోగించి ప్రయాణించాలని కోరారు.


