News February 3, 2026

మేడారం జాతరలో తప్పిపోయిన మహిళ

image

తాడ్వాయి మండలంలోని నర్సింగాపురంలో మేడారం జాతర నుంచి తప్పిపోయిన ఓ మహిళ తిరుగుతుందని స్థానికులు తెలిపారు. తన అక్కకు ఫోన్ చేయాలని, ఆమె అక్క పేరు రజిత అని మాత్రమే చెబుతుండగా ఫోన్ నంబర్ తెలియజేయడం లేదన్నారు. ప్రస్తుతం తాడ్వాయి మండల కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా ఆమె వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు స్థానికులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Similar News

News February 6, 2026

శుక్ర జపంతో శుక్ర దోషం దూరం!

image

శుక్ర జపం అంటే శుక్రుడికి సంబంధించి ‘ఓం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని పఠించే ప్రక్రియ. ఇది మనస్సును శాంతపరుస్తుంది. ఈ జప సాధనతో మెదడులోని ఆందోళనలు తగ్గుతాయి. సహనం పెరుగుతుంది. ప్రేమ గుణం వృద్ధి చెందుతుంది. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలోని శుక్రుడి ప్రభావం బలపడుతుందని నమ్మకం. సంబంధ బాంధవ్యాల్లో మధురత పెరుగుతుందని చెబుతారు. మానసికంగా సిద్ధం చేసి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది.

News February 6, 2026

శుక్ర జపం ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటి?

image

శుక్ర జపాన్ని ప్రశాంత ప్రదేశంలో చేయాలి. వీలైతే తెల్లని దుస్తులు ధరించాలి. ఇందుకు ఉదయం/సాయంత్రం వేళలు అనుకూలం. కళ్లు మూసుకుని మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. 108 పూసల జపమాల ఉంటే దాని సాయంతో వాటిని లెక్కిస్తూ జపించాలి. ఈ సాధనతో అంతర్గత మార్పు మొదలవుతుంది. క్రమంగా నిర్ణయాలు మెరుగుపడతాయి. బంధాలు బలపడతాయి. ఈ ప్రక్రియ మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. బయట ప్రపంచపు ఆనందాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.

News February 6, 2026

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశం: ట్రంప్

image

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. తన మొదటి పదవీకాలంలో కొత్త, పునరుద్ధరించిన అణ్వాయుధాలతో మిలిటరీని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో చాలా కాలం పాటు నిలిచే ఉండేలా అధునాతన, నూతన ఒప్పందంపై న్యూక్లియర్ నిపుణులు పనిచేయాలన్నారు. భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధాలను ఆపినట్లు మరోసారి గొప్పలు చెప్పారు.