News January 29, 2026

మేడారం జాతరలో మహిళ ప్రసవం

image

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్‌ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

Similar News

News February 16, 2026

రూ.10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు: మృణాల్

image

యాక్టర్‌గా ఉండటమంటే సన్యాసిగా జీవించడం లాంటిదేనని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. తిండి, నిద్ర వదులుకోవాలని, ఫోకస్డ్‌గా ఉండాలని చెప్పారు. ‘నాకు PR టీమ్ లేదు. <<19123301>>నాపై వచ్చిన<<>> రూమర్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ₹10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె నటించిన ‘దీ దీవానే సెహర్‌ మే’ ఈ నెల 20న రిలీజ్ కానుంది.

News February 16, 2026

పాక్‌పై విజయం.. అప్పుడూ శివరాత్రి రోజే..!

image

T20 WCలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా <<19153355>>ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్‌తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో FEB 15నే పాక్‌ను మన జట్టు ఓడించింది.

News February 16, 2026

ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

image

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం(ఫొటోలో)
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త, Ex MP లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు