News February 14, 2025

మేడారం జాతర.. మూడవ రోజు కొనసాగుతున్న మొక్కులు

image

మినీ మేడారం జాతరకు మూడవ రోజు శుక్రవారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన మినీ జాతర ఈనెల 15 వరకు జరగనుంది. ఈ మినీ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.

Similar News

News November 4, 2025

భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో పోలవరం నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి, కాలనీల నిర్మాణం, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆదేశించారు.4434 ఎకరాలు అవసరం కాగా ఇంకా సేకరణ చేయాల్సిన భూములకు సంబంధించిన ప్రకటన వెంటనే జారీ చేయాలన్నారు. భూ సేకరణ సంబంధించి భూ యజమాని చనిపోతే వారసులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

News November 4, 2025

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి: జేసీ

image

జిల్లాలో పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జేసీ మంగళవారం మాట్లాడుతూ.. పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతు ఈ-క్రాప్ బుకింగ్, ఈ పంటలో నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జంగారెడ్డిగూడెంలో సీసీఐ సెంటర్లో పత్తి పంట అమ్మకాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. 

News November 4, 2025

ఇల్లంతకుంట: ‘ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలి’

image

అర్హులైనవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు సూచించారు. ఇల్లంతకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు తమ కలల ఇంటిని పూర్తి చేసుకోవాలన్నారు.