News October 22, 2025

మేడారం జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి: సబ్యసాచి ఘోష్

image

మేడారం మహాజాతర ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ శ్రీ మహేశ్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 22, 2025

ప.గో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ఎన్టీఆర్(D) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గొర్రె అరవింద్(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా జంగారెడ్డిగూడెం(M) దేవరపల్లికి చెందిన అరవింద్ మైలవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్‌లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 22, 2025

ఖమ్మం: EVERY CHILD READS ప్రారంభం

image

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో EVERY CHILD READS కార్యక్రమాన్ని నెల రోజుల పాటు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1–5 తరగతి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంటసేపు కేటాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అక్షరాలు, పదాలు, పేరాలు అర్థం చేసుకునే స్థాయికి చేరేలా చేయాలన్నారు.

News October 22, 2025

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.