News October 7, 2025
మేడారం: నాడు రూ.వేలల్లో.. నేడు రూ.కోట్లల్లో!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 1968 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. నాడు జాతరకు హుండీల ద్వారా రూ.లక్ష 20 వేల ఆదాయం రాగా.. జాతరకు రూ.60,000 ఖర్చు అయింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు 2024లో రూ.13.25 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది. జాతర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రూ.100 కోట్లకు అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తోంది.
Similar News
News October 7, 2025
‘న్యూ ఇండియా పార్టీ’కి షోకాజ్ నోటీస్ జారీ: కలెక్టర్

ఆడిట్ రిపోర్టులు సమర్పించకపోవడంతో న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు PDPL జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు. 2021- 24 ఏడాదులకు చెందిన ఆడిట్ అకౌంట్స్ అందజేయలేదని, ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 29ఏ ప్రకారం ఇది తప్పనిసరని పేర్కొన్నారు. నిర్దిష్ట వ్యవధిలో సమాధానం ఇవ్వకపోతే, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తింపు రద్దు వరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News October 7, 2025
VZM: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డా.పద్మజ తెలిపారు.
➤ సమయం: ఈనెల 13న ఉ.10.30 – మ.2వరకు
➤ వేదిక: GGH కాన్ఫరెన్స్ హాలు
➤ అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (75%) + PGDCA (25%)
➤ ఎంపిక విధానం: మార్కుల ఆధారంగా
➤ వెబ్‌సైట్: <
విజయనగరం జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులు
News October 7, 2025
ఆదిలాబాద్: ‘కొమురం భీం ఆశయ సాధనకు కృషి’

ఆదివాసీ యోధుడు కొమురం భీం వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ భీం విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవించారు. కొమురం భీం సేవలు, పోరాట స్ఫూర్తిని వారు స్మరించుకున్నారు. కొమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్, ఎస్పీ పేర్కొన్నారు.