News December 19, 2025

మేడారం పనులపై మంత్రి సీతక్క ఆరా

image

మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను శుక్రవారం రాత్రి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను తరగతి గదిలో పూర్తి చేయాలని గద్దెల పునరుద్ధరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఆలయ ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

Similar News

News December 20, 2025

వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

image

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.

News December 20, 2025

సన్న బియ్యం బోనస్ జమ కాకపోతే ఏం చేయాలి?

image

TG: వరి సన్నాలు సాగు చేసిన రైతుల అకౌంట్లలో సర్కారు బోనస్ జమ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే బోనస్ పడుతుంది. ఒకవేళ రైతు ఖాతాల్లో బోనస్ జమ కాకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలి. పౌరసరఫరాలశాఖ వెబ్‌సైట్‌లోని ‘ఫార్మర్ కార్నర్’లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జ్‌ను సంప్రదించాలి.

News December 20, 2025

మరికల్: ‘జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి’

image

వార్తల కవరేజ్‌కి వెళ్లిన జర్నలిస్టుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని NRPT జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ కార్యదర్శి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చేతకాక అక్రమ కేసులతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల, జర్నలిస్టులపై డిపో మేనేజర్ కేసులు పెట్టడం తగదన్నారు. కేసులు ఉపసంహరించుకోవాలని లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తిరుపతయ్య, ఆశప్ప, లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారు.