News February 7, 2025
మేడారం భక్తులకు బ్యాటరీ ఆఫ్ టాప్స్

మేడారం మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో బ్యాటరీ ఆఫ్ టాప్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో వనభోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్లాలను, చేతిపంపులను సైతం ఏర్పాటు చేశారు. కాగా, నీటిని వృథా చేయొద్దని సూచించారు.
Similar News
News December 13, 2025
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు 2,097 మంది గైర్హాజరు

జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (JNVST) ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 20 కేంద్రాల్లో శనివారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 3,776 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, కేవలం 1,679 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దీంతో ఏకంగా 2,097 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. హాజరు శాతం గణనీయంగా తగ్గింది. పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ముగిసింది.
News December 13, 2025
మెస్సీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్

HYDలో మెస్సీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. మధ్యాహ్నం కోల్‌కతాలో అభిమానులు <<18551215>>స్టేడియంలో<<>> రచ్చ చేయడంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అధికారిక కార్యక్రమం కాకపోయినప్పటికీ ఈవెంట్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మెస్సీ HYDలో ల్యాండ్ అయినప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసేవరకు ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంది. మెస్సీని తనివితీరా చూసిన అభిమానులూ హ్యాపీగా ఫీలయ్యారు.
News December 13, 2025
MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల సమగ్ర సమాచారం!

బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, నరసింహులపేట, పెద్ద వంగర, తొర్రూరు మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 158 సర్పంచ్ స్థానాలకు గాను.. ఇప్పటికే 15 ఏకగ్రీవం అయ్యాయి. 143 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1360 వార్డు మెంబర్ స్థానాలకు గాను.. 255 ఏకగ్రీవం అయ్యాయి. 1105 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.


