News December 31, 2025

మేడారం భక్తుల కోసం గట్టమ్మ వద్ద 10 ఎకరాల పార్కింగ్

image

మేడారం మహా జాతర దృష్ట్యా భక్తుల వాహనాల పార్కింగ్ కోసం గట్టమ్మ పరిసరాల్లో 10 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. బుధవారం SP సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ కలిసి ఈ ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అటవీశాఖ ఈ స్థలాన్ని సమకూర్చడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ స్థలం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News December 31, 2025

మార్కాపురం పర్యటనకు సీఎం చంద్రబాబు రాక?

image

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News December 31, 2025

25వేల పోస్టులు.. కాసేపట్లో ముగుస్తున్న గడువు

image

కేంద్ర సాయుధ పోలీస్ దళాల (CAPF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీ గడువు ఈ రాత్రి గం.11తో ముగియనుంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, AR విభాగాల్లో 25487 ఖాళీలున్నాయి. పోస్టులను బట్టి SSC ఆపై విద్యార్హత, 2026 JAN 1కి 18-23సం.ల వయస్సు వారు అర్హులు. ఏజ్‌పై పలు రిజర్వేషన్లతో పాటు NCC సర్టిఫికెట్ ఉంటే బోనస్ మార్క్స్ ఉంటాయి. అప్లై, ఇతర వివరాలకై SSC అధికారిక సైట్‌కు వెళ్లండి.
Share It

News December 31, 2025

మెదక్: 9 చెరువుల నుంచి నీరు విడుదలకు నిర్ణయం: కలెక్టర్

image

రబీ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 500 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న 9 చెరువుల నుంచి పంటలకు నీరు విడుదలకై చర్చించి నిర్ణయించినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. పెద్ద చెరువు కొంటూరు, హైదర్ చెరువు నార్లాపూర్, రాయరావు చెరువు నర్సాపూర్, దేవతల చెరువు వెల్దుర్తి, హల్దీ వాగు ప్రాజెక్టు హకీంపేట్, పెద్ద చెరువు అంబాజీపేట ఉన్నాయి.