News February 4, 2025

మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

image

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 18, 2025

మల్యాల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని మల్యాల మండలం నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గమనించారు. శవం మరింత ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

అఫ్జల్‌సాగర్‌లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

image

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్‌సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.

News September 18, 2025

HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్‌బాడీ లభ్యం

image

అఫ్జల్‌సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.