News November 13, 2025
మేడారం.. రాజకీయ విమర్శలకు కేంద్రం..!

ఎవ్వరికి ఎవ్వరు తగ్గడం లేదు. దగ్గరలో ఎన్నికలేవీ లేకున్నా ములుగు జిల్లాలో రాజకీయం సలసల కాగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇందుకు మేడారం కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనదేవతల గద్దెల విస్తరణ, అభివృద్ధి పనులను నాసిరకం, నిర్లక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేత నాగజ్యోతి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి సీతక్క ‘చిల్లర విమర్శలు’ అంటూ నిన్న గట్టిగా తిప్పికొట్టారు.
Similar News
News November 13, 2025
NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.
News November 13, 2025
పెద్దిరెడ్డి భూములపై విచారణకు పవన్ ఆదేశం..!

మంగళం పేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్‌పై నివేదిక తయారు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న అమరావతిలో అధికారులతో మాట్లాడారు. వారసత్వంగా వచ్చిన భూములు క్రమంగా ఎలా పెరుగుతూ వచ్చాయని, ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారట. ఇప్పటికే ఫారెస్ట్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, విచారించిన ఫైల్స్‌ను పంపినట్లు సమాచారం.
News November 13, 2025
HYD: బిజీ లైఫ్ వల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్!

HYDలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, నిద్రలేమి, పొగతాగటం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా మెదడుపై తీవ్రంగా ప్రభావంపడుతున్నట్లుగా సీనియర్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ తెలిపారు. HYDలో NIMS ఆసుపత్రికి నెలకు 250 నుంచి 300 కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత, యోగా, ధ్యానం, ప్రకృతితో గడపడం లాంటివి చేయాలని సూచించారు.
SHARE IT


