News November 21, 2025
మేడారం: శబరీష్‌కు నిరాశే..!

మేడారం మహా జాతరను ఒక్క సారైన తమ చేతుల మీదుగా జరిపించడాన్ని ఐపీఎస్ అధికారులు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. రెండు సార్లు అవకాశం దక్కించుకున్న వారూ ఉన్నారు. 2024 జాతరలో అన్నీ తానై వ్యవహరించిన శబరీష్ 2026 జాతరకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. కొత్త రోడ్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు చేయిస్తున్నారు. అయితే అరుదైన అవకాశానికి అడుగు దూరంలో జాతరకు రెండు నెలల ముందు బదిలీ అయ్యారు. ఓ రకంగా ఆయనకు నిరాశే ఎదురైంది.
Similar News
News November 23, 2025
VZM: అక్కడ చురుగ్గా పనులు.. ఇక్కడ మాత్రం..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి వంతెనలు చాలా ఉన్నాయి. వాటిలో సీతానగరం, పారాది, కోటిపాం ప్రధానమైనవి. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ వంతెనలపై నుంచి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే వాహనాల రద్దీ పెరగడంతో వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పారాది, సీతానగరం వద్ద కొత్త వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ కోటిపాం వంతెన పనులకు అడుగులు పడకపోవడం గమనార్హం.
News November 23, 2025
యాలాల: పెళ్లింట విషాదం.. పెళ్లికూతురి తండ్రి మృతి

కూతురు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రికి అనుకోని ప్రమాదం జరిగింది. సంగంకుర్డు గ్రామానికి చెందిన అండాల అనంతయ్య తన కూతురి పెళ్లి ఆదివారం నిశ్చయించారు. పెళ్లికి ముందు ఇంట్లో బంధువుల సందడి నెలకొన్న సమయంలో, అనంతయ్య బైక్ పైనుంచి పడి, తీవ్ర గాయాలతో మృతి చెందారు. పెళ్లికి వచ్చిన వారే అంత్యక్రియల్లో పాల్గొనడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
News November 23, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.


