News January 22, 2026

మేడారం సమ్మక్క తల్లి అత్తగారిల్లు మహబూబాబాద్ జిల్లాలోనే!

image

మేడారం సమ్మక్క తల్లి అత్తగారిల్లు మహబూబాబాద్ జిల్లాలోనే ఉంది. మేడారం జాతరకు వెళ్లేందుకు పగిడిద్దరాజు ముస్తాబవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో భక్తిశ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించారు. సమ్మక్క తల్లి భర్త అయిన పగిడిద్దరాజు ఇక్కడి నుంచి కాలిబాటన నడిచి మేడారం వెల్తేనే అక్కడ.. మహా జాతర ప్రారంభం అవుతుంది.

Similar News

News February 9, 2026

MDK: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సాయంత్రంతో తెర పడింది. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులకు 1,486 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముగించి ఇక సామాజిక ఓట్లపై దృష్టి కేంద్రీకరించారు.

News February 9, 2026

మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 11న సెలవు: కలెక్టర్

image

ఈనెల 11న జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూర్, కేసముద్రం, డోర్నకల్‌లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు స్థానికంగా హాలిడే ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

News February 9, 2026

నల్గొండ‌లో రేపే సదస్సు.. మిస్ అవ్వకండి..!

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. నల్గొండలోని Alimineti Madhava Reddy Police Auditoriumలో FEB 10న సా.6 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు.