News February 12, 2026

మేడారం హుండీ ఆదాయం రూ.13,51,76,275

image

మేడారం వన దేవతల జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం హుండీలను తెరిచి 8 రోజుల పాటు లెక్కించగా రూ.13,51,76,275 ఆదాయం సమకూరినట్లు ఎండోమెంట్ ఉప కమిషనర్ రామల సునీత తెలిపారు. సమ్మక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 309, సారలమ్మ ప్రాంగణంలో 309, గోవిందరాజు వద్ద 81, పగిడిద్దరాజు వద్ద 81 హుండీలను పూర్తిగా లెక్కించారు.

Similar News

News April 5, 2026

VKB: ‘మీ కాళ్లు మొక్కుతా.. భూమి నా పేరిట చేయండి’

image

భూమిని తన పేరిట చేయాలని బాధితురాలు తహశీల్దార్ కాళ్లు మొక్కింది. పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 30/అ2/అలో 4.9ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తన పేరిట చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. అదే గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ‘కాళ్లు మొక్కి వేడుకుంటున్నాను సార్.. నా పేరిట రిజిస్ట్రేషన్ చేయండి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

News April 5, 2026

NRPT: చిన్నారి హత్య.. పోలీసుల అదుపులో అనుమానితులు..?

image

నారాయణపేట మండలం బసిరెడ్డి పల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చిన్నారి హత్య కేసులో అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అత్యాచారం, హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితులను మీడియా ముందుకు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

News April 5, 2026

మాచర్ల సీఐ సస్పెండ్.. సిబ్బందిలో గుబులు

image

పరువు హత్య కేసులో మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెండ్ కావడంతో సిబ్బందిలో గుబులు మొదలైంది. చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకునే విషయంలో సీఐతో పాటు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డుతో పాటు హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తమపై కూడా సస్పెండ్ వేటు తప్పదని మదన పడుతున్నట్లు సమాచారం.