News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 11, 2025
నిఘా నీడలో విశాఖ నగరం: హోంమంత్రి

విశాఖలో ఈనెల 14,15న పార్టనర్షిప్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో నగరమంతా నిఘా నీడలో ఉంచాలని, అణువణువునా గస్తీ ఏర్పాటు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి నక్కపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. విశాఖ నగరమంతా డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
News November 11, 2025
₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్‌లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.
News November 11, 2025
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్ VC

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్ష చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్, పీడీ హౌసింగ్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.


