News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 16, 2025
సూర్యాపేట: రెప్పపాటులో 50 మంది చిన్నారులకు తప్పిన ముప్పు!

సూర్యాపేటలో ఈరోజు స్కూల్ బస్సు అదుపుతప్పి ఒక వ్యక్తిని, <<18584704>>చెట్టును ఢీకొట్టిన విషయం<<>> తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. స్కూల్ అవగానే సుమారు 50 మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో కలిసి వస్తుండగా ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. రెప్పపాటులో పిల్లలకు ముప్పు తప్పి, సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News December 16, 2025
‘సంక్రాంతికి విశాఖ-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు నడపండి’

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య తక్షణమే ప్రత్యేక రైళ్లు నడపాలని బీజేపీ రాష్ట్ర విధాన పరిశోధన విభాగ సభ్యుడు డాక్టర్ కె.వి.వి.వి.సత్యనారాయణ వాల్తేరు డీఆర్‌ఎంను కోరారు. ప్రస్తుతం రైళ్లన్నీ ‘రిగ్రెట్’ (Regret) స్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం భోగికి వారం ముందు, కనుమ తర్వాత అదనపు రైళ్లు, కోచ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
News December 16, 2025
రాజకీయ రౌడీలు తయారయ్యారు: చంద్రబాబు

రాజకీయాల ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని <<18584131>>CM<<>> CBN అన్నారు. ‘నాకూ కొన్ని గుణపాఠాలున్నాయి. నమ్మి మోసపోయా. 2019లో YS వివేకా గుండెపోటుతో చనిపోయారని ఉదయం చెప్పారు. తర్వాతి రోజు నారాసుర రక్తచరిత్ర అని నా చేతిలో కత్తిపెట్టి పేపర్లో వేశారు. నేరస్థులు తప్పించుకుని CMపైనే నేరం వేయాలని చూశారు. జనం నమ్మి వారికి ఓటేశారు. నేను ఓడిపోయా. దోషుల్ని అప్పుడే అరెస్టు చేసుంటే గెలిచేవాడిని’ అని అన్నారు.


