News December 23, 2025
మేడారానికి మంత్రి కొండా దూరం!

మేడారంలో ముగ్గురు మంత్రులు మంగళవారం పర్యటించనున్నారు. దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మంత్రి కొండా సురేఖ హాజరు కావడం లేదు. వరంగల్ నగరంలో పర్యటన ఉన్నా, మేడారానికి రావడం లేదని తెలుస్తోంది. మంత్రుల శాఖల మధ్య విభేదాలు ఇంకా సమసిపోనట్టు సమాచారం. మంత్రికి అనుకూలంగా పని చేసిన ముగ్గురు పోలీసులపై వేటు వేయడంపై గ్యాప్ మరింత పెరిగినట్టు తెలుస్తోంది.
Similar News
News January 2, 2026
ధాన్యం సేకరిస్తున్న పౌర సరఫరా శాఖ: కలెక్టర్

తిరుపతి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ డా.ఎస్.వేంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 1,30,350 ఎకరాల్లో సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
News January 2, 2026
కాంటాక్ట్ నేమ్‌తో కాల్స్ వస్తున్నాయా? No Tension

ఈ మధ్య సేవ్ చేయని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చినా స్క్రీన్‌పై నేమ్ కన్పిస్తోందా? స్కామర్స్, స్పామర్స్‌కు చెక్ పెట్టేలా CNAP ఫీచర్‌ను ట్రాయ్ 2025 OCT నుంచి టెస్ట్ చేస్తోంది. ఈ కాలింగ్ నంబర్ ప్రజెంటేషన్ ఫీచర్‌ను MAR31 లోపు అమలు చేయనుంది. కనెక్షన్ టైంలో ఇచ్చే వివరాలతో టెలికం కంపెనీలు పేర్లు డిస్ప్లే చేస్తాయి. Spamగా Report చేస్తే డేటా అప్డేట్ అవుతుంది. ఇక True Caller లాంటి యాప్స్ అవసరం ఉండదు.Share It
News January 2, 2026
‘కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలి’

కడప జిల్లాలో శతాబ్ద కాలం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమను తక్షణమే పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. కడప జిల్లా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమల లేమివల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు.


