News July 17, 2024

మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.

Similar News

News October 2, 2024

గీసుగొండ: బాలికపై వృద్ధుడి అత్యాచారం

image

గీసుగొండలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై సాంబయ్య (65) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చనిపోగా అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు పరీక్షించి 4నెలల గర్భవతిగా నిర్ధారించారు. సాంబయ్యపై పోక్సో చేసు నమోదైంది.

News October 2, 2024

WGL: నేడు ఎంగిలిపూల బతుకమ్మ

image

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.

News October 2, 2024

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నం: మంత్రి

image

సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు మహాలయ అమావాస్య (పెత్ర అమావాస్య)ను పురస్కరించుకుని మంత్రి సురేఖ మహిళా లోకానికి, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగతో తెలంగాణ పల్లెలు కొత్త కాంతులతో విరాజిల్లుతోందని మంత్రి అన్నారు.