News July 10, 2025

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న భారీ వరద

image

మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఉదయం 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న నీరు సాయంత్రం వరకు 6.9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీరును 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు గోదావరి నదికి వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి రాత్రి వరకు మరింత నీరు రానున్నట్లు తెలిపారు. బ్యారేజ్ వద్ద పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు.

Similar News

News July 11, 2025

మెదక్: ఢిల్లీ నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్

image

ఢిల్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పై జరిగిన నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2025

సంగారెడ్డి: ‘రైతులందరూ ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

image

సంగారెడ్డి మండలంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు అనేది ముఖ్యమైందని, దీని ద్వారా ప్రభుత్వ పథకాలను, రాయితీలను రైతులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క రైతు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

గూడూరు: వృద్ధురాలిని కన్న కొడుకులకు అప్పగించిన పోలీసులు

image

గూడూరు మండలం భూపతి పేటలో వృద్ధురాలు భద్రమ్మను కన్న కొడుకులు రైతు వేదిక వద్ద వదిలేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి ఆదేశాలతో భద్రమ్మ కన్న కొడుకులను హెచ్చరించారు. పోలీసుల కౌన్సిలింగ్‌తో కన్నతల్లిని తీసుకెళ్లడానికి కొడుకులు ఒప్పుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.