News December 20, 2025
మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.
Similar News
News February 21, 2026
BREAKING: NGKLలో రోడ్డు ప్రమాదం.. 18 మందికి గాయాలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులోని వటవర్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా, లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
News February 21, 2026
టాటా పంచ్ ఈవీ కొత్త వెర్షన్.. మిడిల్ క్లాసే టార్గెట్!

మిడిల్ క్లాస్ మార్కెటే లక్ష్యంగా టాటా మోటార్స్ పంచ్ ఈవీలో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం బడ్జెట్ కార్లలో ఈవీలకు అంతగా డిమాండ్ లేకపోవడంతో దానిని బ్రేక్ చేయాలని టాటా భావిస్తోంది. అందుకే ప్రారంభ ధర ₹9.69లక్షలకే (ఎక్స్-షోరూమ్) సెట్ చేసింది. battery-as-a-service ఆప్షన్ ఉండటంతో కారు ₹6.49లక్షలకే రానుంది. కేవలం కారుకే డబ్బు చెల్లించి, బ్యాటరీకి <<19172419>>అద్దె<<>> రూపంలో చెల్లించేది ఈ Baas కాన్సెప్ట్.
News February 21, 2026
సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్.. ఎల్లుండి జట్టులోకి ఎంట్రీ?

అభిషేక్ వరుస డకౌట్లు, తిలక్ పెద్దగా రాణించకపోవడంతో వీరిలో ఒకరి స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రికెట్ సర్కిళ్లో బజ్ నడుస్తోంది. ఆదివారం SAతో జరిగే సూపర్-8 మ్యాచ్‌లో ఆడతారని క్రీడావర్గాలు అంచనా వేస్తున్నాయి. అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలమని, స్పిన్నర్లపై అటాక్ చేసే సంజూను ప్లేయింగ్11లోకి తీసుకుంటారని అంటున్నాయి. అటు ఇవాళ శాంసన్ గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం వీటికి బలం చేకూరుస్తున్నాయి.


