News July 5, 2025
మేడ్చల్‌లో అత్యధికంగా బియ్యం పంపిణీ

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.
Similar News
News July 5, 2025
ఐశ్వర్యరాయ్‌తో విడాకులపై స్పందించిన అభిషేక్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిషేక్ పరోక్షంగా స్పందించారు. ‘సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు మేము అంతగా ప్రాధాన్యత ఇవ్వం. ఇలాంటి వార్తలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా భార్య, తల్లి కూడా బయట జరిగే విషయాలు ఇంట్లోకి తీసుకురారు. ప్రస్తుతం మా కుటుంబమంతా కలిసి హ్యాపీగా జీవిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 5, 2025
జమ్మికుంట: Way2News ఎఫెక్ట్.. సమయ సూచిక ఫ్లెక్సీ ఏర్పాటు

జమ్మికుంట బస్టాండ్ ప్రారంభమై 37 ఏళ్లు అయినా సమయ సూచిక బోర్డును మార్చలేదు. దీనిపై <<16829076>>గత నెల 26న<<>> Way2Newsలో “బస్టాండుకు 37 ఏళ్లు.. మారని సమయ సూచిక” అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు బస్సులు బయలుదేరే సమయ సూచిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలుపుతూ.. బస్టాండ్ ఇరుకుగా ఉందని, దీనిని విస్తరింపజేసి ఈ సమస్యనూ తీర్చాలని కోరుతున్నారు.
News July 5, 2025
ములుగు: ‘లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

జిల్లాలో వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ 1800 4257109 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజలందరూ జిల్లా అధికార వాట్సాప్, ఛానల్‌ను చేసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.