News March 26, 2025

మేడ్చల్‌లో రాజకీయ నిరుద్యోగం..!

image

అర్బన్ జిల్లాగా మేడ్చల్ అవతరించడంతో రాజకీయ నిరుద్యోగం పెరగనుందని నేతన్నల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచాయత్ రాజ్ వ్యవస్థ కనుమరుగై గ్రామాలన్నీ పట్టణాలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ వంటి 700కుపైగా పదవులు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయింది. పట్టణీకరణతో తమ భవిష్యత్తుకే ఎసరు పెట్టారని పలువురు వాపోతున్నారు.

Similar News

News February 14, 2026

ఎమ్మిగనూరు: జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య

image

ఎమ్మిగనూరులోని హరిజనవాడకు చెందిన ఆశీర్వాదం(17) అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. అతడు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పి ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 14, 2026

అశ్వారావుపేట: ఒకే కుటుంబం.. ముగ్గురు కౌన్సిలర్లు

image

అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో ‘నార్లపాటి’ కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే ఇంటి పేరు గల ముగ్గురు సమీప బంధువులు కౌన్సిలర్లుగా గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచారు. 11వ వార్డు నుంచి నార్లపాటి మహేష్, 21 – నార్లపాటి మౌనిక, 22 – నార్లపాటి దివాకర్ విజయం సాధించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పురపాలనలో అడుగుపెట్టడం ఇప్పుడు స్థానికంగా విశేషంగా నిలిచింది.

News February 14, 2026

షాకింగ్ సీక్రెట్: ఇరాన్‌ ఆందోళనల వెనక అమెరికా ‘డాలర్’ ప్లాన్!

image

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం వెనక తమ హస్తం ఉందని అమెరికా ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఆయిల్ ఎగుమతులను అడ్డుకొని బ్యాంకింగ్ రంగాన్ని ఐసోలేట్ చేయడం ద్వారా కావాలనే డాలర్ కొరతను సృష్టించామని తెలిపారు. దీనివల్ల ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ ఏడాదిలో సగానికి పడిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 72% ఎగబాకింది. చివరకు మందులకు కూడా డబ్బుల్లేక ప్రజలు రోడ్లకు మీదకు రావాల్సి వచ్చింది.