News February 23, 2025

మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్‌పేటకు చెందిన యశ్వంత్, జమీల్‌పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 23, 2025

MOST RUNS: పాంటింగ్‌ను దాటేసిన కోహ్లీ

image

టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డులు కొల్లగొడుతున్నారు. PAKపై అద్భుత ఇన్నింగ్సుతో మరో రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ (27483)ను అధిగమించారు. సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లీ (27484) టాప్-3లో ఉన్నారు.

News February 23, 2025

అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధం: జెలెన్‌స్కీ

image

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనడం కోసం అధ్యక్ష పదవిని వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. శాంతి నెలకొల్పినా లేదా నాటో స్యభ్యత్వం ఇచ్చినా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దేశ భద్రతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగాలనేది తన కల కాదని పేర్కొన్నారు. తమ దేశానికి US భద్రతా హామీలు ఇవ్వాలని కోరారు.

News February 23, 2025

నెల్లూరు నుంచి గ్రూప్-2కు తక్కువగా హాజరైన అభ్యర్ధులు.!

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలకు 13 జిల్లాల్లో 92 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అత్యధికంగా విశాఖ జిల్లా వారు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 3546 మంది పరీక్షలకు హాజరై 86.4గా నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న మీమాంస కూడా పరీక్షకు రాకపోవడానికి ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.

error: Content is protected !!