News February 25, 2025

మేడ్చల్: ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్న 1.27లక్షల మంది విద్యార్థులు  

image

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కో ఆర్డినేషన్ మీటింగ్ ను సోమవారం కలెక్టర్ ఛాంబర్లో అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ గౌతం నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి మార్చ్ 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని, ఈ పరీక్షలకు 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఫస్ట్ ఇయర్ 64,107మంది, సెకెండ్ ఇయర్ 62,316 విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

Similar News

News February 3, 2026

పాక్ ఆడకపోయినా శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!

image

పాక్ T20 WC మ్యాచ్‌ను బహిష్కరించినప్పటికీ IND శ్రీలంకకు వెళ్లాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం భారత కెప్టెన్ SKY టాస్ కోసం మైదానంలోకి వెళ్లాలి. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రాకపోతే, రిఫరీ భారత్‌కు ‘వాకోవర్’ ప్రకటించి 2 పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ భారత్ కూడా అక్కడికి వెళ్లకపోతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓ జట్టు మైదానంలోకి రాకపోతే ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటించడమే వాకోవర్.

News February 3, 2026

కాళ్లకల్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం కాల్లకల్‌లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి కుమార్(25) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాళ్లకల్‌లో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

News February 3, 2026

కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్

image

కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఎన్విరామెంటల్ డిపార్ట్మెంట్ పచ్చ జెండా ఊపింది. వికారాబాద్ జిల్లా పరిధిలోనూ ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సైతం అధికారుల అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. దీని ద్వారా వికారాబాద్, నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో మొత్తం కలిపి దాదాపుగా లక్ష ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.