News January 26, 2025
మేడ్చల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.43 లక్షల దరఖాస్తులు

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని మొత్తం 1,43,267 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 1.మేడ్చల్ 2.మల్కాజిగిరి 3.కూకట్‌పల్లి 4.కుత్బుల్లాపూర్ 5. ఉప్పల్ నియోజకవర్గాలు కాగా..ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో జిల్లాకు 17,500 ఇళ్లు రానున్నాయి.
Similar News
News October 31, 2025
వాంకిడి: ‘నా కూతురు చావుకి కారుకులైన వారిని శిక్షించాలి’

తన కూతురు ప్రేమలత చావుకి కారకులైన వారిని శిక్షించాలని తండ్రి మేంఘజి కోరారు. ఈ మేరకు వాంకిడి ఎస్ఐ మహేందర్‌కి ఫిర్యాదు చేశాడు. ఖిరిడికి చెందిన ప్రేమలత(22)అదే గ్రామానికి చెందిన మహేశ్‌ను వివాహం చేసుకుంది.ఈనెల 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఆమెను వర్ధా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 29న మృతిచెందింది. అత్తింటి వారి వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.
News October 31, 2025
జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేటి వరకు జిల్లాలో 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించడంతోపాటు, ఈరోజు వరకు మొత్తం 29,100 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను కొన్నామన్నారు.
News October 31, 2025
దస్తూరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రేవోజిపేట గ్రామంలోని కొత్త పల్లెలోని ముప్పిడి రాధ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.


