News March 23, 2025
మేడ్చల్: ఓయో హోటల్ సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓయో హోటల్స్ సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈసీఐఎల్‌లో జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ సీజ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోటల్ ముందు ధర్నా నిర్వహించారు. మైనర్లను ఓయోలోకి అనుమతించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Similar News
News March 2, 2026
మైండ్‌లో మ్యాటర్.. హ్యాండ్‌లో పవర్ ఉండాలి: హరీశ్ రావు

పదవ తరగతి విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. “మీ మైండ్‌లో మ్యాటర్ ఉంటేనే సరిపోదు.. పరీక్షలో వేగంగా రాయడానికి హ్యాండ్‌లో పవర్ ఉండాలి” అని చమత్కరించారు. ఏకాగ్రతతో చదివి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టి, తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు.
News March 2, 2026
VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News March 2, 2026
TU: M.Ed మూడో సెమిస్టర్ ఫీజు చెల్లింపుకు అపరాధ రుసుంతో నేడే ఆఖరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం రూ.100తో నేడే ఆఖరు తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. రూ.1,210 ఫీజుతో పాటు అపరాధ రుసుంతో చెల్లింపునకు అవకాశముందన్నారు. సాయంత్రం లోపు పరీక్షల ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.


