News November 3, 2025
మేడ్చల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి

పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం శామీర్‌పేట్ పరిధి అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలు పరిష్కరించాలని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలని కోరారు.
Similar News
News November 4, 2025
చేవెళ్ల: 19 మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ ఇదే..!

మీర్జాగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో 19మందిని పొట్టనపెట్టుకున్న టిప్పర్‌పై 2చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో చందానగర్, RCపురంలో HYD పోలీసులు చలాన్లు విధించారు. అనిత అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకరలోడు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
News November 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 04, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.